అనంతపురం,ధర్మవరం,గుంతకల్లు రైల్వే స్టేషన్లలో లిఫ్టులు,ఎస్కలేటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ గుంతకల్లు రైల్వే డివిజన్ మేనేజర్ వెంకటరమణా రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సిపిఐ బృందం డిఆర్ఎం ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లా డుతూ ఎన్నో దశాబ్దాల కాలంగా అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో ప్రయాణించే ప్రయాణికులు ఒక ప్లాట్ ఫారం నుండి మరో ప్లాట్ఫారం లోకి వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారిందన్నారు.ప్రయాణికుల సమ స్యను గుర్తించి లిఫ్టులు, ఎక్సలేటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
అదేవిధంగా గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఒక్కొక్క ప్లాట్ఫారం లో ఒక్కొక్క టే లిఫ్ట్ ఉందని ప్రయాణికులకు ప్రతి ప్లాట్ఫారంలో ఎస్కలేటర్ అవసరం ఉందన్నారు.ముఖ్యంగా చిన్నపిల్లలు, తల్లులు,వృద్ధులు,అనేక మంది ఫ్లాట్ ఫారాలు మారేందుకు తీవ్రఇబ్బం దులుపడుతున్నారన్నారు.గుంతకల్లు స్టేషన్లో రాత్రి వేళలో ఎస్కలేటర్లు, లిఫ్టులు పనిచేయడం లేదన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్లాట్ఫారాలలో లిఫ్టులు ఎస్కలేటర్లు 24 గంటలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్ఎం ను కోరారు. కరోనా సమయంలో గుంతకల్లు స్టేషన్ నుండి వచ్చిపోయే రైళ్లను కొన్ని రద్దు చేశారని వాటిని మరల పునరుద్దించాలని కోరారు.
వాటిలో యశ్వంతపూర్ నుండి విజయవా డకు,అదేవిధంగా కొల్లాపూర్ నుండి సికింద్రాబాద్, యశ్వంతపూర్ నుండి గుంతకల్లు మీదుగా టాటా నగర్, ట్రైన్ నెంబర్ 22157 మెయిల్ ట్రైన్ మధ్యాహ్నం కాకుండా సాయంత్రా నికి టైం మార్పు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్,సిపిఐ నాయకులు మల్లయ్య,మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.