30 ఆంధ్ర బెటాలియన్, ఎన్ సి సి నగర్, కడపలో ఈ రోజు ఉదయం జరిగిన రైఫిల్ ఫైరింగ్ లో ఎన్ సి సి కేడెట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ విభోర్ గుప్తా ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రాజ్ కుమార్ తాపా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కడప మరియు అన్నమయ్య జిల్లాల ఎన్సిసి అధికారులు లెఫ్టినెంట్ నీలయ్య, లెఫ్టినెంట్ మహేష్, లెఫ్టినెంట్ వెంకటరమణ, థర్డ్ ఆఫీసర్లు పి. రాజశేఖర్, ఇమామ్ కాసిం మరియు ఆఫీస్ సిబ్బంది సూపరిండెంట్లు సరస్వతి, డేవిడ్, ఉమ, ప్రియా, రాజగోపాల్ రెడ్డి, శివ ప్రసాద్ మరియు పరేడ్ శిక్షకులు సుబేదార్ మేజర్ సుఖేందర్ సింగ్, ఈశ్వర్ రెడ్డి, ఎస్. ఎస్ రావు, జగదీశ్వర్ మరియు క్యాడెట్లు పాల్గొన్నారు.