గుంటూరు కేవీపీ కాలనీ, లాలూపురం రోడ్డులోని మిర్చి ఎగుమతుల కంపెనీలో భారీ చోరీ జరిగింది. బైక్పై వచ్చిన ఇద్దరూ దుండగులు ఇరవై లక్షల రూపాయలు అపహరించుకుపోయారు. దుండగులు వాచ్ మెన్ కాళ్ళు చేతులు కట్టేసి చంపుతామని బెదిరించారు. అలాగే అక్కడ కాపలా ఉన్న కుక్క అరవకుండా దానికి చికెన్ ముక్కలు వేశారు. విషయం తెలుసుకున్న కంపెనీ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.