గడగడపకు ప్రభుత్వం నిర్వహణ, ఎమ్మెల్యేల పనితీరు.. ఈ అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేలతో వర్క్‌షాప్ నిర్వహించారు. దీనిలో చిలకలూరిపేట శాసనసభ్యురాలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పనితీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొక్కుబడిగా నియోజకవర్గంలో మంత్రి గడగడకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అందిన సర్వే నివేదికల అధారంగా సీఎం జగన్ రజనిపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గతంలో జరిగిన వర్క్‌షాప్‌లో కూడా రజనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోమారు అమె పరితీరుపై అసంతృప్తి వ్యక్తం కావడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది.