తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 28 ఏళ్ల చంద్రమౌళికి పారిశ్రామికవేత్త, TTD చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. ఈక్రమంలో శుభలేఖలు పంచడానికి చెన్నై వెళ్లిన ఆయనకు హార్ట్ఎటాక్ రావటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా చంద్రమౌళి ముంబయిలో ఉద్యోగం చేస్తున్నారని, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారని సమాచారం.