రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో తాను పాల్గొంటానని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తెలిపారు. యాత్రలో పాల్గొనాలని రాహుల్ తనని ఆహ్వానించారని కమల్ వెల్లడించారు. దీంతో తాను ఈ నెల 24న యాత్రలో పాల్గొనబోతున్నట్లు తెలిపారు. ఆదివారం రోజు జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో కమల్ ఈ విషయాన్ని తెలిపారు. భారత్ జోడో యాత్రలో కమల్ తో పాటు పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారని పార్టీ అధికార ప్రతినిధి మురళి అప్పాస్ తెలిపారు.