ఫిఫా ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ జరిగిన పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై ఆ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో గెలిచింది. దీంతో అర్జెంటీనా మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది. తన జట్టుకు విజయం సాధించి పెట్టిన తర్వాత లియోనల్ మెస్సీ తన రిటైర్మెంట్‌పై స్పందించారు. ఈ వరల్డ్ కప్ తర్వాత తాను రిటైర్ అవుతాడన్న వార్తలపై ఆయన క్లారిటీ ఇస్తూ, తనకు ఆ ఆలోచన లేదని మరికొంత కాలం ఆటలో కొనసాగుతానని మెస్సీ చెప్పాడు. దీంతో 2026లో జరగబోయే వరల్డ్ కప్‌లోనూ మెస్సీ ఆడే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa