టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పై మహమ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించారు. బ్యాటింగ్ టెక్నిక్ లో శ్రేయస్ ను ధోనీతో పోల్చారు. "ధోనీ ఫామ్ లో లేడని అందరూ మాట్లాడేవారు. కానీ ధోనీ బాగా ఆడి విజయాలు అందించేవాడు. శ్రేయస్ కూడా అదే వర్గానికి చెందినవాడు. అయ్యర్ కి పరుగులు చేయడం తెలుసు కానీ, ఒక బలహీనత ఉంది. పుల్ షాట్ ఆడే క్రమంలో ఔటవుతున్నాడు. అయినప్పటికీ 2022లో మంచి రికార్డును కలిగి ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో పరుగులు సాధిస్తున్నాడు. బంగ్లాతో తొలి టెస్టులోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు" అంటూ కైఫ్ వివరించాడు.