తెలుగు సంవత్సరంలో 12 నెలలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వచ్చే ఏడాది 13 నెలలు ఉండనున్నాయి. దీంట్లో రెండు శ్రావణ మాసాలు ఉండనున్నాయి. ఒక ఏడాదిలో ఇలా 13 నెలలు రావడం 19 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సౌరమాన, చంద్రమాన పంచాంగాల ప్రకారం రోజుల లెక్కింపులో ఉన్న తేడాల కారణంగానే ఇలా అధికమాసం వస్తుంది. సౌరమానం ప్రకారం ఏడాదికి 365 రోజుల 6 గంటలు ఉండగా, చంద్రమానం ప్రకారమైతే ఏడాదికి 354 రోజులే ఉంటాయి. ఏడాది లెక్కింపులో ఉండే ఈ తేడాలను అధికమాసం రూపంలో సరిచేస్తుంటారు.