బౌద్ధ గురువు, ప్రముఖ ఆధ్యాత్మక వేత్త దలైలామా భారత్ ను అత్యుత్తమ దేశంగా అభివర్ణించారు. శాశ్వత నివాసం హోదాతో హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రాలో ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. అయితే తవాంగ్ ఘటనపై ఆయన్ను ప్రశ్నించగా.. ‘యూరప్, ఆఫ్రికా, ఆసియాలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. చైనా కూడా సౌకర్యవంతంగా మారుతోంది. అయినా కానీ, చైనాకు తిరిగి వెళ్లేది లేదు. నా ప్రాధాన్యం భారత్ కే. ఇదే ఉత్తమ ప్రదేశం.’ అని దలైలామా పేర్కొన్నారు.