రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, మాట తప్పని, మడమతిప్పని నేత సీఎం వైఎస్ జగన్ అని మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటి నియోజక వర్గంలో వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుచున్నాయి. రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనూ, జగనన్న మహిళా మార్ట్ లోనూ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ, బస్ స్టాండ్ సర్కిల్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కార్యక్రమాలలోనూ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ సిపి నాయకులతో కలసి మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈసందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ చెదరని చిరునవ్వే ఆయుధంగా, పోరాడే గుణమే బలంగా , మహానేత వైఎస్ఆర్ ఆశయాలే వారసత్వంగా , పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంమే ధ్యేయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సీఎం జగన్ నడిపిస్తున్నా రన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి జగన్ రికార్డ్ సాధిస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమానికి తండ్రి వై ఎస్ ఆర్ ఒకడుగు ముందుకేస్తే జగన్ రెండడుగులు ముందుకేస్తు న్నారన్నారు. వేల కోట్ల రూపాయల నిధులను సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాలలోకే అందచేసారన్నారు. అర్హతే ఆధారంగా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నారన్నారు. తన పాదయాత్రలోనూ, ఎన్నికల సమయంలోనూ ఇచ్చిన హామీలను రెండన్నర ఏళ్ల పాలనలో తొంభై ఎనిమిది శాతానికి పైగా హామీలును నెరవేర్చిన ఘనత దక్కుతుందన్నారు.