ఏపీలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతూనే ఉన్నాయి. 2018తో పోలిస్తే 2022 నాటికి అత్యాచారాలు 22 శాతం, దాడులు 15 శాతం, ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసులు 31 శాతం మేర పెరిగినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి లోక్ సభలో తెలిపారు. ఏపీలో 2018 నుండి 2021 వరకు మహిళలపై 4,340 అత్యాచారాలు, 4,406 ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసులు, 18,883 దాడులు చోటుచేసుకున్నాయని మంత్రి వెల్లడించారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కల్గించడంలో ఏపీ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది.