రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘ సాంకేతిక కమిటీ ఛైర్మన్ గా పలాస నియోజకవర్గానికి చెందిన కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామవిద్య ఉపాధ్యాయుడు కె. హరిబాబు నియమితులయ్యారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘ సర్వసభ్య సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హరిబాబు గత ఎనిమిదేళ్లుగా సాంకేతిక కమిటీ కన్వీనర్ గా, అంతకుముందు పదేళ్లు రాష్ట్ర పీఈటీ సంఘానికి ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. హరిబాబు నియామకం పట్ల బుధవారం రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి విజయకుమార్, రాష్ట్ర పీఈటీ సంఘ సంయుక్త కార్యదర్శి తవిటయ్య, జిల్లా కార్యదర్శి సాంబమూర్తి అభినందనలు తెలిపారు.