సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడిపందాలు ప్రారంభమవుతాయి. ఈ పందాల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ పాల్గొంటారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలపై కలెక్టర్ ఆంక్షలు విధించారు. జిల్లాలో కోడిపందాలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీచేశారు. దీనికోసం డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం కోడి పందాలకు స్థలం ఇచ్చినవారికి నోటీసులు సైతం జారీచేశారు. అంతేకాకుండా సంక్రాంతి పండుగ రోజుల్లో 144 సెక్షన్ అమలు చేయాలనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.