భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 26 నుండి రాష్ట్రంలో ఐదురోజుల పాటు పర్యటించనున్నారు. అయితే, తొలిరోజు ఆమె శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అదే రోజు సికింద్రబాద్ లోని యుద్ధ స్మారకం వద్ద రాష్ట్రపతి అమరవీరులకు నివాళులు అర్పించి, వారి సతీమణులను సన్మానిస్తారు.