కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. దేశంలో కోవిడ్ ప్రస్తుతం పరిస్థితి, అది వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు.