గుంటూరు మీదగా రాకపోకలు, సాగించే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లకు శాశ్వత ప్రాతిపదికన అదనపు స్లీపర్ క్లాస్ భోగిలను రైల్వే శాఖ మంజూరు చేసింది. ఈనెల 20 నుంచి నెం(17243/17244) గుంటూరు-రాయగడ- గుంటూరు ఎక్స్ ప్రెస్ కు మూడు జనరల్ బోగీల స్థానంలో మూడు స్లీపర్ క్లాస్ బోగీలు శాశ్వతంగా ఏర్పాటు చేస్తోన్నారు. దీంతో ఈ రైలు ఆ రోజు నుంచి ఒక ఏసీ త్రీ టైర్, 10 స్లీపర్, 6 జనరల్, 2 బ్రేక్ వ్యాన్ భోగిలతో ప్రయాణిస్తుంది.