మహిళపై లైంగిక దాడి కేసులో గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన ముద్దాయి నరవ సన్యాసిరావుకు మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ. పదివేల జరిమానా విధిస్తూ మొబైల్ మెజిస్ట్రేట్ మొహ్రాత్ బేగం బుధవారం తీర్పు చెప్పారు. ఏపీపీ శాంతి గౌతమి అందించిన కేసు వివరాలిలా ఉన్నాయి. నరవ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తతో గొడవలు పడుతోంది.
నాకు తెలిసిన పోలీసులు ఉన్నారు. మీ భార్యాభర్తల సమస్య పరిష్కరిస్తానని బాధిత మహిళ వద్ద సన్యాసిరావు రూ. ఎనిమిది వేలు తీసుకున్నాడు. ఇలా వారి మధ్య చనువు పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని 2018 మార్చి 18న బాధిత మహిళపై సన్యాసిరావు లైంగిక దాడికి పాల్పడ్డాడు. సమీపంలో ఉన్నవారు 100 కి డయల్ చేసి ఫిర్యాదు చేయగా వెంటనే పోలీ సులు సన్యాసిరావును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారా లతో కేసు రుజువు చేయడంతో మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు.