మాజీ మంత్రి డియల్ రవీంద్ర రెడ్డి కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. డియల్ రవీంద్ర రెడ్డి కి బైజుస్ కంపెనీ గురించి అవగాహనా ఉందా, కరోనా వల్ల విద్యార్థులు నష్టపోయారు అని అందరికి నాణ్యమైన విద్యా అందించాలి అన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం కంపెనీతో కలిసిందని అన్నారు. అందులో అవినీతి జరిగింది అని ఇంకిత జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు.
ఆయన కాలేజీ లలో ఉద్యోగుల కు జీతాలు ఇవ్వకుండా, అధిక ఫీజు లు వసూలు చేస్తూ అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు. 2014 లో టీడీపీ పార్టీ కి భార్య తో ప్రచారం చేయడం ఆయన వేరే పార్టీ లో ఉండి సమంజసమా, 2019 లో జగన్ సీఎం అవుతారు అని పిలవకున్న ఆయనే వచ్చారు. ఆయన రమ్మని పిలిస్తే వెళ్ళాము. సిగ్గులేకుండా ఇంకా నేను వైసీపీ పార్టీ లో ఉన్నాను అని డియల్ చెబుతున్నారు ఇంకా అయన ను దగ్గరికి రాణిస్తామా అని అన్నారు.
2004 లో నేను టీడీపీ లో ఉన్నాను నన్ను ప్రొద్దుటూరు లో పోటీలో నిలబడాలి అన్నారు. నేను సరే అన్నాక ఆయన సైలెంట్ గా సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన సేవలు ఎవరు విశ్వసించారు. అప్పుడు ఆయన ఆస్తి ఎంతో అందరికి తెలుసు సొంతంగా ఇల్లు లేదు నేడు ఆయన అస్తి ఎన్ని వందల కొట్లో తెలుసు. నెలకు 50లక్షల రూపాయలు బాడుగలు వస్తున్నాయి అవి ఎలా వచ్చాయో అయన చెప్పాలి. కడప జిల్లాలో ఆయన లాంటి అవినీతి పరుడు ఎవరు లేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ లో ఉండి తిరుపాల్ రెడ్డి పోటీ చేస్తున్న సొసైటీ మీద ఎందుకు స్టే ఇవ్వలేదు. ఇంకా ఎన్నో అవినీతి చిట్టలు ఉన్నాయని త్వరలో అన్ని విప్పుతా అని అన్నారు.