స్థానిక ఎంఎస్ఎన్ కందులాపురం ప్రాథమిక పాఠశాలలో గురువారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు సీహెచ్. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఆర్పీలు బాబురావు, రవీంద్రనాయక్, మురళీమోహన్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నాగరాజు మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఎల్లప్పుడూ ప్రేమను, కరుణను కలిగి ఉండాలని బోధించారని తెలిపారు. ప్రతిఒక్కరూ క్షమాగుణంతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే యావత్ ప్రపంచం సుఖఃశాంతులతో ఉంటుందని అన్నారు. ఏసుక్రీస్తు ఘనతను ప్రాశస్త్యాన్ని అభివర్ణిస్తూ క్రీస్తుశకము క్రీస్తు పూర్వముగా కాలాన్ని విభజించడం ఏసుక్రీస్తు గొప్పతనానికి నిదర్శనమని కొనియాడారు. సిఆర్పీ బాబురావు మాట్లాడుతూ యేసు క్రీస్తు అందరికి ఆదర్శప్రాయుడనీ ఆయన మార్గం అనుసరణీయమని అన్నారు. అనంతరం భారీ కేకును కట్ చేసి విద్యార్థులందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిలు బాబురావు, రవీంద్ర నాయక్, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.