పులివెందుల పట్టణంలోని బ్రాహ్మణ పల్లె రోడ్డులో గల శ్రీ స్వామి వివేకానంద స్కూల్ లో గురువారం ప్రిన్సిపాల్ సుహాసిని ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వసీం, గీత హాజరయ్యారు. ముందుగా ఉపాధ్యాయురాలు వారికి పుష్పాలతో స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీనివాస రామానుజన్125వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. పిల్లలు రకరకాల తయారుచేసిన ఆకృతులను వారు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ. రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు, ఆ రాష్ట్ర వాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22 ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్పుట్టినరోజును నేషనల్ మ్యాథమెటిక్స్ డే ప్రకటించారు. 125వ జయంతి సందర్భంగా 2014ను భారత ప్రభుత్వం జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించిందని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.