రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు సరఫరా చేసిన ట్యాబులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష పంపిణీ చేశారు. గురువారం కడప నగరంలోని మునిసిపల్ ఉర్దూ పాఠశాలలో సర్వశిక్షా అభియాన్ పిఓ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను సాంకేతిక పరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని అందులో భాగంగానే నేడు ట్యాబ్ లు పంపిణీ జరిగిందన్నారు. కార్యక్రమంలో కడప నగరపాలక మేయర్ సురేష్ బాబు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.