బ్రహ్మంగారి మఠం లో ఉన్న గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులను సగిలేరు గురుకుల కళాశాల కు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం అకస్మాత్తుగా బ్రహ్మంగారి మఠం గురుకుల పాఠశాలకు తనిఖీకి వచ్చిన నూతన డి. సీ. ఓ కు వినతి పత్ర రూపంలో విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ మాట్లాడుతూ. యధావిధిగా ఇంటర్మీట్ ను బ్రహ్మంగారి మఠానికి తేవాలని వారికి తెలపడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులతో కలుపుకొని ఆందోళన చేస్తామని వారిని హెచ్చరించడం జరిగింది.