జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లత్కర్ ను అయన ఛాంబర్లో గురువారం ఎన్జీఓ సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు సాయిరాం, చల్లా శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జిల్లా, టౌన్ సంఘ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గ సభ్యులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. జిల్లాలో ఉద్యోగులు మంచి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ సంతృప్తిని వ్యక్తపరిచారు. ఉద్యోగుల సమస్యల సంఘ నేతలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కొరకు తనవంతు సహకారం అందిస్తానని కలెక్టర్ శ్రీకేష్ లత్కర్ హామీనిచ్చారు. అనంతరం జాయింట్ కలెక్టర్ నవీన్ ను ఎన్జీఓ సంఘ నేతలు మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు. కలెక్టర్, జె. సి. ని కలసిన వారిలో జిల్లా, టౌన్ సంఘ నేతలు బడగల పూర్ణచంద్రరావు, బి. నవీన్, శశిభూషణరావు, రవికుమార్, జి. రత్నకుమార్, కె. రోజాకుమారి, మమతాకుమారి, నారాయణమ్మ, సబినాబేగం తదితరులు వున్నారు.