పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ విమర్శలు చేసారు. జిల్లా ఎస్పీలా కాకుండా వైసీపీ జిల్లా అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఇన్ని రోజులు అధికారంలో ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలుగుదేశం నేతల ఇళ్లు, కార్లను వైసీపీ పార్టీ నేతలు తగులు బెడితే వారిపై కేసులు పెట్టకుండా, కాపాడుతున్నారని విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడటం మానేసి,వైసీపీ నేతల కంటే ఎక్కువగా చేస్తున్న రవిశంకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.