కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కేరళ-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ ప్రమాదం జరిగింది.మృతులంతా తమిళనాడులోని తేని, అండిపేటకు చెందిన వారని పోలీసులు తెలిపారు. అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa