వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎక్కడకెళ్లినా వేలాది మంది స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు. జగన్ సభలకు బలవంతంగా జనాన్ని తీసుకెళ్లినా జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ విశ్వాస ఘాతకుడిగా అభివర్ణించారు. ఆర్టీసీ బస్సు చార్జీలతో పాటు విద్యుత్ చార్జీలు పెంచారని విమర్శించారు. మళ్లీ కరోనా రావాలని ముఖ్యమంత్రి ఇంట్లో పూజలు చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ వస్తే ప్రతిపక్ష నేతలు జనాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చని జగన్ భావిస్తున్నారని విమర్శించారు. చెల్లితో తెలంగాణలో పార్టీ పెట్టించారన్నారు. వైసీపీ దోపిడీదారులంతా ధనికులు అని తెలిపారు. వైసీపీ నేతలు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం ప్రైవేటు స్థలాలు కబ్జా చేస్తోందని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక బఫూన్ అన్నారు. పోలీసులు ఇప్పటికైనా సిగ్గుపడి ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. సీఐడీ ఒక దరిద్రపు విభాగంగా మారిందని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.