అదనపు కట్నం కోసం భర్త వినోద్‌కుమార్ రెడ్డి, అత్త లక్ష్మీదేవి, మరిది రామకిషోర్ రెడ్డి నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నారని కర్నూల్ జిల్లా, ఆస్పరికి చెందిన కొత్తింటి మమత గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వరప్రసాద్ శుక్రవారం తెలిపారు. పెళ్లి సమయంలో రూ.15 లక్షల నగదు, 80 తులాల బంగారంతోపాటు, 2 కేజీల వెండి, కట్న కానుకల కింద తమ పెద్దలు ఇచ్చారని, అయినా అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ వరప్రసాద్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa