నంద్యాల జిల్లాలోని డోన్ రైల్వేస్టేషన్ వద్ద అర్థరాత్రి మందుబాబులు వీరంగం సృష్టించారు. మహిళా న్యాయాధికారి వెళ్లాల్సిన ఆటోను అడ్డుకున్నారు. మహిళా న్యాయాధికారి అని చెప్పినా వినకుండా హోంగార్డుపై మందుబాబులు చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీస్ స్టేషన్లో మహిళా న్యాయాధికారి ఫిర్యాదు చేశారు. అయితే డోన్ పట్టణ పోలీసుల తీరుపై మహిళా న్యాయాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఇద్దరు మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.