ఉపాధి కోసం గల్ఫ్ లోని మస్కట్ కు వెళ్లి మోసపోయిన బి. మఠం కు చెందిన శంకరమ్మ 40సం, అనే మహిళ ఏజెంట్ మాయ మాటలతో మస్కట్ దేశంలో ఇబ్బందులు పడుతున్నాని, జీతం ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారని, తనను రక్షించి స్వదేశానికి రప్పించేలా చూడాలని కడప జిల్లా ఎస్పీ కె. కె. ఎన్ అన్బురాజన్ కు సెల్ఫీ వీడియో ద్వారా వేడుకోవడం జరిగింది. తక్షణమే స్పందించి స్వదేశానికి రప్పించేలా చర్యలు చేపట్టాలని వేడుకుంది. జిల్లా ఎస్. పి చొరవతో శనివారం క్షేమంగా బి. మఠం కు చేరుకున్నారు. జిల్లా ఎస్. పి కే. కే. ఎన్ అన్బురాజన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని, సాయం మరువలేనని శంకరమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.