ముంచంగిపుట్టు మండలంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని రంగబయలు పంచాయతీ పరిధి పట్నా పడల్ ఫుట్ గ్రామానికి చెందిన కిల్లో. రాజు ద్విచక్ర వాహనంపై ముంచంగిపుట్టు శనివారం వారపు సంతకు వస్తుండగా పోలిపుట్ సమీపంలోని మలుపు వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో విషయం తెలుసుకున్న వైఎస్ ఎంపీపీ భాగ్యవతి హుటాహుటిన ఘటన చోటుకు చేరుకొని గాయాలతో ఉన్న రాజును ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఇందులో వైఎస్ ఎంపీపీ భాగ్యవతి వెంట వైసీపీ నాయకులు అప్పారావు, తిరుపతి దేవస్థానం, తదితరులు ఉన్నారు.