మరమ్మత్తుల నిమిత్తం సంతరావూరు దగ్గర కొమ్మమూరు కాలువ వంతెన పై సోమవారం నుండి రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వంతెనకు రంధ్రాలు పడ్డంతో చాలాకాలంగా ఈ మార్గంలో ఆటోలు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు తిరగక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ కలెక్టర్ కు తమ మొర వినిపించుకోగా ఆమె స్పందించి తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం 6. 5 లక్షల రూపాయలు మంజూరు చేశారని, ఈ పనులు సోమవారం మొదలవుతాయని ఆయన వివరించారు. మరమ్మతులు పూర్తి కావడానికి నెలరోజులు పడుతుందని, అంతవరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఈ. ఈ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa