చీరాల మండలం దేవాంగపురి పంచాయతీకి చెందిన భాగవత్ భక్తి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం వేటపాలెం ప్రధాన కూడలిలో పాదచారులకు, ప్రయాణీకులకు కృష్ణ భగవానుని ప్రసాదం పులిహోర వితరణ జరిగింది. ట్రస్ట్ చైర్మన్ కె. శివశంకరరావు చాలాకాలంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంట్లోనే పులిహోరను వండించి తన వాహనంలో తీసుకువెళ్లి కూడళ్ళలో అన్నార్తులకు సంతర్పణ చేస్తుంటారు. అలాగే భగవద్గీత పుస్తకాలను కూడా ఆయన పంపిణీ చేస్తుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa