నీకోసం లోక రక్షకుడు పశువుల పాకలో పుట్టియున్నాడు, మీరు వెళ్లి ఆయనను దర్శించుడి అని ఆకాశము నుండి వినబడిన స్వరము ఈరోజేనని, పశువుల పాకలో జన్మించినది లోక రక్షకుడని మహనీయుడు మహోన్నతుడని, కడప కతోలిక మేత్రసనం అపోస్తులిక పాలన అధికారి బిషప్ శ్రీ శ్రీ శ్రీ గాలి బాలి అన్నారు. క్రీస్తు జయంతి క్రిస్మస్ పండుగ సందర్భంగా సెయింట్ మేరీస్ క్రేతిడల్ చర్చి నందు అర్ధరాత్రి ప్రత్యేక దివ్యబలి పూజను ఆయన సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు ప్రభువు జయంతి మానవాళికి రక్షణ దినమని, నీకోసం లోక రక్షకుడు ఉదయించాడని అందుకు సాదృశ్యమే ఆకాశమున ఒక వింతైన నక్షత్రము ఉద్భవించినదని ఆ నక్షత్రమును అనుసరించిన వారు ఎల్లవేళలా ప్రకాశించెదరని ఆయన తెలిపారు. ఆకాశంలోని నక్షత్రములన్ని నేలపై రాలినట్టు క్రీస్తు ప్రభువు మా కుటుంబంలో జన్మించాడని తెలియచెప్పే నక్షత్రాలు ఎక్కడ చూసినా వాడవాడలా దర్శనమిస్తున్నాయని ఇది మంచి శుభ సూచకమని ఆయన అన్నారు.
క్రీస్తు ప్రభువు రెండవ రాకడ సమయం ఆసన్న అవుతుందని దాని సూచకాలే ఈరోజులలో లోకంలో వింత వింత విపత్తులు సంభవిస్తున్నాయని మనుషులందరూ అప్రమత్తమై ఆ దేవాది దేవుని ఎడతెగక ప్రార్థించాలని, దేవుని చిత్తానుసారంగా జీవించాలని ఆయన కొనియాడారు. ఇదే మంచి సమయం అని రక్షణ దినమని పశుల పాకలో జన్మించిన క్రీస్తు ప్రభువును దర్శించి ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. అనంతరం క్రిస్మస్ కేకు కట్ చేసి విశ్వాసులందరికీ పంచుతూ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు అని ఒకరి ఒకరు తెలుపుకున్నారు. కార్యక్రమంలో విచారణ గురువులు ఫాదర్ బిరుసు రాజా, సహాయ గురువు ఫాదర్ చంద్ర, ఫాదర్ రూపేష్, ఫాదర్ లూర్డ్ రాజు, సిస్టర్స్, విచారణ పెద్దలు పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు విశ్వాసులు. ఆరోగ్యమాతలో విచారణ డైరెక్టర్ ఫాదర్ అబ్రహం ఆధ్వర్యంలో 24, అర్ధరాత్రి దివ్యబలిపూజ, 25, ఉదయం క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa