ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి చేసుకోమనందుకు..ప్రియురాలిని చితకబాదిన ప్రియుడు

national |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 11:48 PM

ప్రేమ పేరుతో సాగుతున్న ప్రేమలో నిజాయితీ కరువవుతోంది. తాజాగా పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని నడిరోడ్డుపైనే చావబాదాడో ప్రియుడు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలోని యువకుడిని మౌగంజ్ ప్రాంతంలోని ధేరా గ్రామానికి చెందిన 24 ఏళ్ల పంకజ్ త్రిపాఠిగా గుర్తించారు. 19 ఏళ్ల అమ్మాయితో అతడు ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో నడిరోడ్డుపైనే ఆమెను కిందపడేసి దాడిచేసి చితకబాదాడు. గత బుధవారం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు తాజాగా నిందితుడు పంకజ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, అతడిపై ఫిర్యాదు చేసేందుకు బాధిత యువతి నిరాకరించడంతో ఆ తర్వాత నిందితుడిని పోలీసులు వదిలిపెట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa