ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవనన్న సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 26, 2022, 07:06 PM

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాలలో సాధ్యమని రాష్ట్ర జనసేన చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం సోమవారంతో 44వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాపాట కార్యక్రమంలో భాగంగా ఒంటిమిట్ట మండల పరిధి గంగపేరూరు గ్రామ పంచాయతీలోని ఎస్టి కాలనీ, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ రూపొందించిన సిద్ధాంతాల కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ, పవనన్న ప్రజాపాట సాగుతుందన్నారు.


ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాఠాల రామయ్య మాట్లాడుతూ , ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనను ప్రజలందరూ, దృష్టిలో ఉంచుకొని రాబోయే 2024 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో జనసేన వీరమహిళలు నరసమ్మ, లక్ష్మీదేవి, లోకా, రమ, గౌరి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com