చీరాల నియోజకవర్గ పరిధిలో ఆలయాల్లో హుండీల దొంగతనాలకు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను సోమవారం రాత్రి బాపట్ల రూరల్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 15 వేల రూపాయల నగదు స్వాధీన పరుచుకున్నారు. తలపాల వంశీ, దేవరకొండ కృప, ముకిరి శరత్, ఊటుకూరి పవన్ అనే వారు ముఠాగా ఏర్పడి చీరాల, వేటపాలెం, ఈపూరు పాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆలయాలలో హుండీల చోరీలకు పాల్పడినట్లు బాపట్ల డిఎస్పి శ్రీనివాసరావు మీడియాకు చెప్పారు. లోతుగా విచారణ చేస్తున్నామని, వారికి ఇంకా ఏమైనా నేరాలతో సంబంధం ఏమైనా ఉందేమో అని కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.