చీరాల బస్టాండ్, రైల్వేస్టేషన్, ఓవర్ బ్రిడ్జి పరిసర ప్రాంతాలలో రోడ్లపై తలదాచుకునే యాచకులు, వృద్ధులు 50 మందికి 'మానవత 'సేవా సంస్థ ద్వారా సోమవారం రాత్రి దుప్పట్ల పంపిణీ జరిగింది. సంస్థ చైర్మన్, ప్రముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత కుమార్ స్వయంగా రాత్రంతా తిరిగి చలికి బాధ బాధపడుతున్న వారిని గుర్తించి దుప్పట్లు అందజేశారు. కన్వీనర్ బత్తుల బ్రహ్మారెడ్డి, సంస్థ అధ్యక్షుడు ఎ. నాగవీరభద్రాచారి, కార్యవర్గ సభ్యులైన పి. శివాంజనేయప్రసాద్, మువ్వల శివ ప్రసాదరావు, గాదె హరిహరరావు, అత్తవారి రామారావు, ఆది మూలం ప్రభాకర రావు, లక్ష్మీపతి తదితరులు కూడా పాల్గొన్నారు.