పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీమా రంగ నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్ డీఏఐ) చర్యలకు నడుం బిగించింది. 3 డోసుల టీకా తీసుకున్న వారికి సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల పునరుద్ధరణపై డిస్కౌంట్ ఇవ్వాలని అన్ని బీమా సంస్థలను కోరింది. కరోనా క్లెయిమ్స్ వీలైనంత త్వరగా పరిష్కరించాలని, డాక్యుమెంట్ల అవసరాన్ని తగ్గించాలని కోరింది. బీమా సంస్థలు తమ వెల్ నెట్ నెట్ వర్క్ ద్వారా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించుకునే విధంగా పాలసీదారులను ప్రోత్సహించాలని ఇందుకు వారికి రాయితీలు కల్పించాలని సూచించింది.