పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ముగ్గురు హిజ్రాలను చంపిన కేసులో ఓ మాజీ మంత్రి కుమారుడికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. పంజాబ్ మాజీ మంత్రి అజ్మల్ చీమా తనయుడు అహ్మద్ బిలాల్ చీమా 2008లో సియోల్‌కోట్‌లోని తన ఔట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన పార్టీకి ముగ్గురు హిజ్రాలను పిలిచాడు. అయితే పార్టీలో తాను, తన స్నేహితులు చెప్పినట్టుగా చేసేందుకు వారు నిరాకరించడంతో వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనపై నమోదైన కేసును విచారించిన సియోల్‌కోట్ జిల్లా సెషన్స్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. నిందితుడికి మరణదండనతో పాటు బాధిత కుటుంబాలకు నష్టపరిహారంగా ఒక్కొక్కరికి రూ.5లక్షలచొప్పున అందజేయాలని ఆదేశించారు.