ఫిలీప్పీన్స్ దేశాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వరదల్లో 26 మంది మృతిచెందినట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్ మెంట్ కౌన్సిల్ తెలిపింది. ఈ వరదల్లో మొత్తంగా 3,93,069 మంది బాధితులుగా ఉన్నారని తెలిపారు. 292 పునరావాస కేంద్రాలలో 81,443 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. క్రిస్మస్ రోజు సాయంత్రం ప్రారంభమైమ వరదలు ఫిలిప్పీన్స్ లో 9 మున్సిపాలిటీలను ముంచెత్తాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ వరదల ప్రభావం వ్యవసాయంపై భారీగా పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa