స్కూల్‌కు ఫుల్‌గా మద్యం తాగొచ్చిన ఉపాధ్యాయుడు, క్లాస్‌రూంలో నేలపైనే పడుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటు చేసుకుంది. పేర్దూరు పరిధిలోని అలంగర్ ప్రభుత్వ పాఠశాలలో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఫుల్‌గా మద్యం తాగి స్కూల్‌కి వచ్చాడు. మద్యం మత్తులో తరగతి గదిలోని నేలపైనే పడుకున్నాడు. ఇది గమనించిన స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఉపాధ్యాయుడిని నిద్ర లేపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ఉపాధ్యాయుడు నిద్ర నుంచి లేవలేదు. అతడిని సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.