నదిలో కొట్టుకుపోతున్న విద్యార్థిని కాపాడి ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. మహాకాళపడా ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు వనభోజనాల కోసం నయాగడ్ జిల్లాలోని కంటిలో ప్రాంతానికి వెళ్లారు. అక్కడ స్నానం చేసేందుకు కొంతమంది విద్యార్థులు మహానదిలోకి దిగారు. వీరిలో ఒక విద్యార్థి నదిలో కొట్టుకుపోతుండగా గమనించిన ఉపాధ్యాయుడు సరోజ్ దాస్ కాపాడేందుకు నదిలోకి దిగారు. విద్యార్థిని ఒడ్డువైపు లాగి, సరోజ్ దాస్ ప్రవాహంలో కొట్టుకుపోయారు. రెండు గంటలు గాలించగా ఉపాధ్యాయుడు దొరికారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.