అమెరికాలో సరస్సులో పడి మరణించిన తెలుగువారి సంఖ్య మూడుకు పెరిగింది. సోమవారం అరిజోనా సరస్సులో జరిగిన ప్రమాదంలో హరిత ముద్దన మరణించగా, ఆమె భర్త నారాయణ(49) గల్లంతయ్యారు. మంగళవారం ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయనతో పాటు మరో తెలుగు వ్యక్తి గోకుల్ మడిశెట్టి మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. నారాయణ-హరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, సోమవారం ఓ సరస్సు వద్దకు విహారయాత్రకు వెళ్లారు. ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలు అమెరికా నుంచి జిల్లాకు చేర్చేందుకు మూడు వారాలు పడుతుందని గుంటూరు జిల్లా పాలపర్రులోని మృతుల తల్లిదండ్రులు, బంధువులు వాపోయారు.