తమ వివాహేతర సంబంధం వదులుకోవాల్సి వస్తుందేమోనన్న భయంతో ప్రియురాలి భర్తను చంపాడో ఓ వ్యక్తి. 33 ఏళ్ల పీ వెల్దురై అలియాస్ శంకర్ పెయింటింగ్ పని చేస్తూ చెన్నైలో ఉంటున్నాడు. తిరునెల్వేలి జిల్లాకు చెందిన మహిళతో అతడికి వివాహమైంది. పుట్టింట్లో ఉంటున్న వీరబుధిరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న శంకర్ తన భార్యను చెన్నైకి రమ్మని కోరాడు. దీంతో వివాహేతర సంబంధం ముగుస్తుందని భావించిన వీరబుధిరన్ మహిళ భర్తను కలిసేందుకు చెన్నై వెళ్లాడు. అక్కడ మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. వీరబుధిరన్ తన వెంట తీసుకెళ్లిన కత్తితో శంకర్‌ను పొడిచి ప్రేయసితో కలిసి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.