సాధారణంగా ఒక కోడి రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు పెడుతుంది. కానీ ఉత్తరాఖండ్ లో ఓ కోడి 12 గంటల్లోనే ఏకంగా 31 గుడ్లు పెట్టింది. ఆల్మోరా జిల్లా బాసోత్ గ్రామానికి చెందిన గిరీశ్ చంద్ర బుధాని వద్ద ఒక కోడి ఉంది. ఈ కోడి రోజుకు రెండు గుడ్ల చొప్పున పెట్టేది. కానీ ఈ నెల 25న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటలవరకు 31 గుడ్లు పెట్టిందని గిరీశ్ తెలిపాడు. వివరాలు తెలుసుకునేందుకు గిరీశ్ ఇంటికి వచ్చిన పశుసంవర్థకశాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో కోడిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గిరీశ్ ఇంటికి వస్తున్నారు.