ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండు కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వానికి ఉచితంగా అందించింది. రూ.410 కోట్ల విలువైన డోస్‌లను ఉచితంగా అందజేస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని సీరం ఇన్‌స్టిట్యూట్‌లోని గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ ఓ నివేదికలో వెల్లడించారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు 170 కోట్ల కంటే ఎక్కువ డోసుల కోవిషీల్డ్‌ని జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమం కోసం ప్రభుత్వానికి అందించింది.