మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం స్పందించారు. ముంబై నగరం ఎప్పటికీ మహారాష్ట్రదే కానీ ఎవరి సొత్తు కాదని అన్నారు. ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్న కర్ణాటక డిమాండ్ పై ఆయన మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలుపుతానని ఆయన వెల్లడించారు.