కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనాను ఇప్పుడు యాంటీ వైరల్ డ్రగ్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఆ దేశవాసులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి భారత్‌వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో భారత్ జనరిక్ ఔషధాలకు చైనా బ్లాక్‌మార్కెట్‌లో విపరీతంగా డిమాండు పెరిగింది. ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నుట్, మోల్నాట్రిస్ తదితర మందులను కొనుగోలు చేసేందుకు చైనీయులు డార్క్‌వెబ్, ఇతర ఆన్‌లైన్ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. నిజానికి భారత ఔషధాలకు చైనా ప్రభుత్వ అనుమతి లేదు. అయినా ప్రాణాలు రక్షించుకొనేందుకు చైనీయులు రకరకాల మార్గాల్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు.