అమెరికాలో మంచు తుపాను తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. బఫెలో నగరం మంచులో కూరుకుపోయింది. పశ్చిమ న్యూయార్క్‌లో భారీగా మంచు కురిసినట్లు జాతీయ వాతావరణ సంస్థ చాలా చోట్ల కార్లలో, ఇళ్లలో, మంచు దిబ్బల్లో ప్రజలు చనిపోయినట్లు తెలుస్తోంది. పశ్చిమ న్యూయార్క్‌లో మంచు తుపాను ధాటికి ఇప్పటి వరకూ సుమారు 30 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. రోడ్లపై మంచు పేరుకుపోవటంతో జనజీవనం స్థంబించింది. మంచు లేని ప్రదేశాల్లో కార్లు నడపడానికి వీల్లేకుండా పోతుంది. రోడ్లపై కార్లు బొమ్మల్లా జారిపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.